- సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యూ ట్యూబర్ ప్రశ్న రావణ్ పై ప్రభుత్వం ఉపా చట్టాన్ని పెట్టడం దుర్మార్గమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రావణ్ పై పలు స్టేషన్లో కేసులు నమోదు చేసినా, ప్రతి చోట బెయిలు వచ్చిందని పేర్కొన్నారు. రావణ్ ను జైలుకు పంపాలనే ఈ చట్టాన్ని పెట్టారని విమర్శించారు. దేశద్రోహులుగా ఉన్న వారికే ఉపా చట్టం వర్తిస్తుందనేది గుర్తించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో బూతులు మాట్లాడటం సరైంది కాదని తెలిపారు. ప్రభుత్వం చిన్న కారణం చూపి రావణ్ పై ఉపా చట్టం న మోదు చేయడం తగదని హితవు పలికారు. ఎదురు మాట్లాడితే ఎంతకైనా తెగించి వారిని జైల్లో పెడతామనే హెచ్చరిక చేసేందుకు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. దేశంలో విమర్శలు చేసిన వారిపై ఉపా చట్టం ఉపయోగించిన దాఖలాలేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్పందించి ప్రశ్న రావణ్ పై నమోదు చేసిన ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)