శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Pan IIT AP Summit 2026 - విజయవాడలో పాన్‌ ఐఐటి ఎపి సమ్మిట్ 2026

03 అక్టోబర్, 2026

vja sammit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : విజయవాడలో పాన్‌ ఐఐటి ఎపి సమ్మిట్ 2026 శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మంత్రి లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటి డైరెక్టర్లు, ఐటి నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చ జరగనుంది. అలాగే ఇంధనం, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్‌, స్పేస్‌, ఏరోస్పేస్‌పై ప్యానెల్‌ చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఛైర్ ఆఫ్ ది సమ్మిట్ స్వదీప్ పిల్లారిశెట్టి మాట్లాడుతూ ... మొదటిసారి 20 సంవత్సరాల్లో విజయవాడలో అతిపెద్ద ఈవెంట్‌ను పాన్ ఐఐటి నిర్వహిస్తోందని తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఐఐటి ల డైరెక్టర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇది కాన్ఫరెన్స్ కాదని.. కన్వర్జెన్స్ అని అందరూ గుర్తించాలని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ రంగాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి.. అభినందనలలో కాదని, బోర్డు రూమ్‌లలో జరిగే నిర్ణయాల ద్వారా అవుతుందని వెల్లడించారు. దీన్ని గుర్తించే ఎపి ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని స్వదీప్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్‌ను మరింత సులభంగా అందించడంతోపాటు పాలనను సులభతరం చేసేందుకు పనిచేస్తున్నామని ఐటి సెక్రటరీ కాటంనేని భాస్కర్ అన్నారు. మంత్రి లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్కువ కనిపించాలి.. పాలన ఎక్కువ అందించాలనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ప్రోయాక్టివ్ పాలసీలు తీసుకువచ్చామన్నారు. సెమికండక్టర్, లిఫ్ట్ పాలసీ లాంటివి ఎన్నో తీసుకువచ్చామని తెలిపారు. కంపెనీలు బెస్ట్ టాలెంట్‌ను తీసుకువస్తే.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇస్తోందన్నారు. ఎపి ని ఒక డెస్టినేషన్‌లా భావించి ఇక్కడి అవకాశాలు అందింపుచ్చుకోవాలని సూచించారు. చర్చల తరువాత పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్‌‌కు సిద్ధం కావాలని కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్