శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పౌల్ర్టీ పరిశ్రమ ముందడుగు

1 రోజు క్రితం

​నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పౌల్ర్టీ పరిశ్రమ ముందడుగు
- నెక్‌ ‌డే వేడుకల్లో విజయవాడ మేయర్‌‌గా ఎన్నికైన రాధాకృష్ణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నెక్‌ ‌డే వేడుకల్లో విజయవాడ మేయర్‌‌గా ఎన్నికైన రాధాకృష్ణ

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పౌల్ట్రీ పరిశ్రమ మరింతగా ముందడుగు వేస్తోందని, లక్షలాది కుటుంబాలకు నిత్యం జీవనోపాధి కల్పిస్తోందని విజయవాడ మేయర్‌‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కోడిగుడ్డు ప్రాముఖ్యతను సమాజానికి తెలియసేందుకు డాక్టర్ బివి.రావు గొప్ప ప్రయత్నం చేశారని కొనియాడారు. నెక్‌ (నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ - ఎన్‌ఇసిసి) డే సందర్భంగా విజయవాడ రూరల్‌ ‌మండలం ప్రసాదంపాడులోని జోనల్‌ ‌కార్యాలయం (ఉత్తరదేవి, డాక్టర్ బి.వి.రావు భవన్) లో కోళ్ల రైతులు, అనుబంధ సంస్థల సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. ముందుగా నెక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, కోడిగుడ్డు ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజెప్పిన భారత పౌల్ర్టీ రంగ పితామహుడు, పద్మశ్రీ డాక్టర్ బండా వాసుదేవరావు (బి.వి.రావు) 91వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి రాధాకృష్ణ పూలమాలలువేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెవిటి, మూగ, వికలాంగ విద్యార్థులు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉడికించిన కోడి గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ నేడు లక్షలాది మందికి పౌల్ట్రీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోందన్నారు. కోడిగుడ్డు సామాన్యులకు అతి చౌకగా లభించే పౌష్టికాహారంగా గుర్తించిన మహానుభావుడు డాక్టర్ బివి.రావు అన్నారు. విద్యార్థి దశలోనే నిత్యం కోడిగుడ్లను ఆహారంలో తీసుకోవడం వలన ఎముక, కండరాలు దృఢంగా ఉంటాయని, అటు క్రీడలలోనూ, ఇటు చదువులోనూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచే అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. అనంతరం రాధాకృష్ణను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెక్ డైరెక్టర్ శివ శేషరెడ్డి, నెక్ చైర్మన్ పి.శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్