- సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
విజయవాడ : పార్లమెంటు సమావేశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి పలు అంశాలపై నేడు, రేపు విజయవాడలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు రాసిన ''కుల నిర్మూలన మార్క్సిస్టు దృక్పథం'' పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన దేశం ప్రపంచంలో సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని రాఘవులు పేర్కొన్నారు. దేశం ముందుకు పోవాలని కోరుకునేవారందరూ దీనిఫై ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్ శర్మ , ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ లక్ష్మయ్య పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)