మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి ఎక్స్‌ ఖాతాను పునరుద్ధరించాలని ఆదేశించిన ఢిల్లీహైకోర్టు

8 గంటల క్రితం

CJP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 02:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)ఎక్స్‌ ఖాతాను పునరుద్ధరించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. సిజెపి ఎక్స్‌ ఖాతాను కేంద్రం నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత్‌ శర్మ ఈ ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 21న జరగనున్న నీట్‌ పున:పరీక్ష‍కు ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం తలెత్తకుండా నివారించేందుకు కేంద్రం ఎక్స్‌ ఖాతాను నిలిపివేసిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ‘‘ ఇప్పటికే నీట్‌ పరీక్ష‍ ముగిసినందున, ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఈ ఉత్తర్వును రద్దు చేస్తున్నాము. పిటిషన్‌ను అనుమతిస్తున్నాము’’ అని జస్టిస్‌ శర్మ పేర్కొన్నారు. సిజెపి ఎక్స్‌ ఖాతానే మే 21న నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనంతరం సిజెపి కాక్రోచ్‌ ఈజ్‌ బ్యాక్‌ అనే పేరుతో కొత్త ఎక్స్‌ ఖాతాను ప్రారంభించింది. ప్రస్తుతం 2.27లక్ష‍ల మందికి పైగా ఈ ఖాతాను అనుసరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్