మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గుమ్మిడిపూండి కాపర్ రీసైక్లింగ్‌ యూనిట్‌లో పేలుడు.. ఒకరు మృతి

6 రోజుల క్రితం

Gummidipoondi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 02:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడులోని గుమ్మిడిపూండిలోని సిప్‌కాట్‌ పారిశ్రామిక వాడలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒక వలస కార్మికుడు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లాలోని ప్రైవేట్ కాపర్‌ స్క్రాప్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లో కాపర్‌ని కరిగించే కొలిమిలో మంగళవారం తెల్లవారుజామున పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక, సహాయక బృందాలు, పోలీస్‌, కంపెనీ సిబ్బందిని వారిని గుమ్మిడిపూండిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక కార్మికుడు మరణించాడు. వీరంతా బీహార్‌కు చెందిన వలసకార్మికులు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుందని, దర్యాప్తుకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్