శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు - పలు రాష్ట్రాలకు హెచ్చరికలు

2 గంటల క్రితం

Heavy rains across the country – warnings issued for several states.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : బలమైన అల్పపీడనం ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7-20 సెం.మీ నుండి ప్రారంభమై అక్కడక్కడ 20 సెం.మీ పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


భారీ నుంచి అతి భారీ వర్షాలు..

తీర కర్నాటక, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పు రాజస్థాన్, తెలంగాణ, విదర్భలలో అక్కడక్కడ ఈ వర్షాలు కురుస్తాయని అంచనా వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్, నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, గంగా పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, అంతర్గత కర్నాటక, కేరళ, మాహె, మరాఠ్వాడా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు-పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్‌లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.


బలమైన ఉపరితల గాలులు..

కర్నాటక, లక్షద్వీప్, రాయలసీమలలో అక్కడక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అనవసర ప్రయాణాల నివారించాలని, నదులు, వాగుల సమీపంలో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్