జెనీవా : ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో సుమారు 4,000మందికి పైగా లెబనీయులు మరణించారు. మార్చి 2 నుండి నేటి వరకు, ఇజ్రాయెల్ దళాలు జరిపిన నిరంతర బాంబు దాడుల ఫలితంగా 4,192 మంది మరణించగా, 12,171 మంది గాయపడ్డారు. గతేడాది అక్టోబర్ నుండి చేపట్టిన దాడుల్లో 1.30 బిలియన్ డాలర్ల (సుమారు 130 కోట్ల రూపాయలు)మౌలిక సదుపాయాల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి)’ మంగళవారం వెల్లడించింది. లెబనీస్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సహకారంతో యుఎన్‌డిపి రూపొందించిన ఈ నివేదిక లెబనాన్ ఇజ్రాయిల్ దాడి కారణంగా ఏర్పడిన వినాశకరమైన పరిణామాలను వెల్లడించింది.
ఈ నివేదిక ప్రధానంగా లితానీ నదికి దక్షిణాన ఉన్న సమస్యాత్మక ప్రాంతాలపై అధ్యయనం చేపట్టింది. నిరంతరం పర్యవేక్షణ ఉండే బింట్ జబీల్, మార్జయోన్, నబతియే, టైర్, సిడాన్ పరిపాలనా జిల్లాల పరిధిలోని వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని గుర్తించింది. సైనిక దాడుల్లో 17,891 గృహాలు పూర్తిగా ధ్వంసం కాగా, 5,219 నివాసాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18,282 భవనాలలో స్వల్పంగా ప్రభావితమయ్యాయని నివేదిక వెల్లడించింది. 3.1 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు విషపూరిత శిథిలాలు ఏర్పడ్డాయని, దీంతో పునరుద్ధరణ చర్యలపై తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొంది.
ఇజ్రాయిల్ దాడుల్లో 4,000మందికి పైగా లెబనీయులు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)