లక్నో : అయోధ్య రామామందిరంలో పనిచేసే ఉద్యోగుల కాల్ రికార్డులపై దర్యాప్తు చేపట్టాలని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై స్పందించారు. అయోధ్య ఆలయంలో పనిచేస్తున్న వారందరి కాల్ డీటెయిల్ రికార్డులను (సిడిఆర్)లను పరిశీలించాలని, వారిలో 99.9శాతం మందికి బిజెపితో సంబంధాలు ఉంటాయని అన్నారు. ఈ విషయం వెలుగులోకి వస్తే అధికార బిజెపిలో ఎంతటి కలకలం వస్తుందో ఊహించలేరని అన్నారు. ఇప్పటికే ఆ పార్టీని వీడి బయటకు వచ్చే ప్రక్రియ మొదలైందని, చాలామంది తమను సంప్రదించడం కూడా ప్రారంభించారని అన్నారు. ఎన్నికల ప్రయోజనాలకు అనుగుణంగా బిజెపి తన సిద్ధాంతాన్ని మార్చుకుంటుందని, అవసరమైతే మతపరమైన విలువలను కూడా పక్కనపెడుతుందని అన్నారు. బాధ్యతలు అప్పగించిన వారు తప్పించుకుతిరుగుతున్నారని, బాధ్యతలు స్వీకరించిన వారే విచారణను ఎదుర్కొంటున్నారని అన్నారు. రామ మందిరం విషయంలో బాధ్యతలు అప్పగించిన వారు ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
రామమందిర ఉద్యోగుల కాల్ రికార్డులపై దర్యాప్తు చేపట్టాలి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 11:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)