బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్‌జెడి ఆందోళనపై విరుచుకుపడిన బీహార్‌ పోలీసులు.. పలువురి అరెస్ట్‌

1 గంట క్రితం

Tejashwi Yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 03:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాట్నా : నిరుద్యోగం, పేపర్‌ లీక్స్‌, పరీక్ష‍ల్లో పారదర్శకత కోరుతూ రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) లోక్‌భవన్‌కు చేపట్టిన మార్చ్‌పై బీహార్‌ ప్రభుత్వం విరుచుకుపడింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్‌లను ప్రయోగించారు. బీహార్‌ అసెంబ్లీ ప్రతిపక్ష‍నేత తేజస్వీయాదవ్‌, ఆర్‌జెడి ఎంపి మీసా భారతి సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రజలు మేల్కొన్నారని, వీధుల్లోకి వచ్చారని తేజస్వీయాదవ్‌ అన్నారు. ప్రభుత్వం తలొగ్గక తప్పదని, ఇటువంటి నిర్బంధ చర్యలు పనిచేయవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివాన్‌లో నిరసన చేపడుతున్న విద్యార్థులపై ఎకె-47 ప్రయోగించడంపై ఆర్‌జెడి ఎంపి మీసా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును బీహార్‌ ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఎకె-47 వినియోగించినట్లు బీహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించిందని, ఎకె-47 వినియోగించమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిందని అన్నారు. ఒకవేళ జిల్లా మెజిస్ట్రేట్‌ ఆదేశిస్తే.. ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీహార్‌లో యువత, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ పరిపాటిగా మారిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్యార్థులు మాటల గారడీ కోరుకోవడం లేదని, పరిష్కారం కావాలని ఆయన స్పష్టం చేశారు. పేపర్‌ లీక్‌ సహా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గవర్నర్‌కు మెమోరాండం సమర్పించేందుకు లోక్‌భవన్‌ కు మార్చ్‌ చేపట్టామని మరో ఆర్‌జెడి ఎమ్మెల్యే అలోక్‌ కుమార్‌ మెహతా పేర్కొన్నారు. అది విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం పట్టించుకోనపుడు.. రాజ్యాంగ పరంగా గవర్నర్‌ రాష్ట్ర సంరక్ష‍ుడవుతారిన అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్