న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ‘ప్రజాస్వామ్య విజయం’గా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అభివర్ణించారు. వీధుల నుంచి పోరాడి సాధించుకున్న ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. శనివారం ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన వెంటనే వాంగ్‌చుక్ ‘ఎక్స్’ వేదికగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి, ఓపిక, పట్టుదలకు దక్కిన ప్రతిఫలమిదని వాంగ్‌చుక్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోని ప్రతీ మూల నుంచి భయాన్ని వీడి, గళమెత్తిన పౌరులకు, జెన్-జీ యువతకు, సీజేపీకి నా అభినందనలు. బాధ్యతాయుత పాలన డిమాండ్ నుంచి మొదలైన ఈ పోరాటం, ఇప్పుడు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణల దిశగా అడుగులు వేయాలి’’ అని పేర్కొన్నారు. పరీక్షల అక్రమాలు, ప్రశ్న పత్రాల లీక్‌లపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ వాంగ్‌చుక్ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా .... ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు ఐక్యంగా ప్రశ్నిస్తే ఎంతటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు.
'ఇది ప్రజాస్వామ్య విజయం` : సోనమ్ వాంగ్‌చుక్
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)