ముంబయి : టెట్ 2026 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. సోనూసింగ్, మిథున్ సింగ్, కపిల్ దహియాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుందని అధికారులు తెలిపారు. గురువారం వారిని స్థానిక మెజిస్రేట్ ఎదుట హాజరుపరచగా, పోలీస్ కస్టడీకి పంపాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు. టెట్ పరీక్షకు ఒక రోజు ముందు ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. థానే జిల్లా పోలీసులు ప్రశ్నాపత్రంలోకి కొంతభాగం లీక్ అయినట్లు గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. లీకేజీ ముఠా ఢిల్లీ, ఆగ్రా, బీహార్, హర్యానా అంతటా విస్తరించి ఉందని సిట్ తెలిపింది. దర్యాప్తు కోసం పలు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపినట్లు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి విజయేంద్ర గుప్తా, ఆయన భార్య సుమన్ గుప్తాను పాట్నాలో అరెస్ట్ చేశారు.
టెట్ లీకేజీ కేసు: మరో ముగ్గురు అరెస్ట్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)