హైదరాబాద్ : '' అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించిందని, నిరంకుశ పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు.`` అని సినీనటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తనదైన శైలిలో నిలదీస్తూ, ప్రశ్నించేతత్వంతో ముందుకు సాగే ప్రకాష్ రాజ్ తాజాగా న్యూఢిల్లీలో యువత సాధించిన విజయంపై ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో సాగిన పోరాటాన్ని, దానికి మద్దతుగా నిలిచిన యువతను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అత్యంత పదునైన పదజాలంతో అభినందనలు తెలియజేశారు. అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించిందన్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. “నా ప్రియమైన ‘కాక్రోచెస్’ (బొద్దింకలు) కి నా అభినందనలు.. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్ సర్ మరియు యువత పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక నిరంకుశ పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు.`` అని ప్రకాష్ రాజ్ పోస్టులో పేర్కొన్నారు. ఆయన మద్దతుదారులు ఈ వ్యాఖ్యలను ప్రశంసిస్తుంటే, మరోవైపు దీనిపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
నిరంకుశ పాలనను సైతం మీరు మోకాళ్లపైకి తెప్పించగలరు : ప్రకాష్ రాజ్
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)