శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇన్‌స్టామార్ట్‌లో 340 మందిపై వేటు

3 గంటల క్రితం

mart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : స్విగ్గీకి చెందిన క్విక్‌ కామర్స్‌ విభాగం ఇన్‌స్టామార్ట్‌ పొదుపు చర్యల్లో భాగంగా సుమారు 340 మంది ఉద్యోగులను తొలగించింది. బ్లింకిట్‌, అమెజాన్‌ నౌ వంటి సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం. ఆగస్టులో ఇన్‌స్టామార్ట్‌ సిఇఒగా బాధ్యతలు చేపట్టిన మాజీ మింత్రా సిఇఒ నందితా సిన్హా నేతృత్వంలో ఉద్వాసనలు జరిగాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇన్‌స్టామార్ట్‌ నికర నష్టం ఏడాది క్రితం ఉన్న రూ.1,092 కోట్ల నుంచి రూ.922 కోట్లకు తగ్గింది. మరోవైపు మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పెట్టుబడులు, కొత్త విభాగాల విస్తరణను కొనసాగిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్