గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచంద్రశేఖరన్‌ పునర్నియామకంపై సవాల్‌

4 గంటల క్రితం

చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై సవాల్‌
హైకోర్టును ఆశ్రయించిన టాటా ట్రస్ట్స్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హైకోర్టును ఆశ్రయించిన టాటా ట్రస్ట్స్‌

ముంబయి : టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై వివాదం న్యాయస్థానానికి చేరింది. మరో ఐదేళ్ల పాటు ఆయనను ఛైర్మన్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌, ఆర్‌డి టాటా ట్రస్ట్‌లు గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. జరిగిన నష్టానికి పరిహారంగా సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ రూ.50 కోట్లు, ఆర్‌డి టాటా ట్రస్ట్‌ రూ.15 కోట్లు.. మొత్తంగా రూ.65 కోట్లతో పాటు 18 శాతం వార్షిక వడ్డీని కోరాయి. సెప్టెంబర్‌ 17న టాటా సన్స్‌ బోర్డు ఆమోదించిన పునర్నియామక తీర్మానం కంపెనీ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లోని 121వ నిబంధన ప్రకారం చెల్లదని ట్రస్టులు వాదిస్తున్నాయి. ట్రస్టుల నామినీ డైరెక్టర్ల అనుకూల ఓట్లు తప్పనిసరని, నోయల్‌ టాటా వ్యతిరేకించగా వేణు శ్రీనివాసన్‌ మద్దతు ఇచ్చారని పేర్కొన్నాయి. ఈ నెల 30న బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ ఛైర్మన్‌ హోదాలో ఓటు వినియోగించకుండా నిరోధించడమే పిటిషన్ల ఉద్దేశమని తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్