- సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్ కేసుల్లో ప్రమేయం
- అభియోగాల ఉపసంహరణకు ‘నో’
న్యూఢిల్లీ : అనతికాలంలోనే కోటానుకోట్లకు పడగలెత్తిన అదానీ గ్రూపు సంస్థల అధినేత, బిజెపి పెద్దల సన్నిహితుడు గౌతమ్ అదానీకి అమెరికా ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్ (వ్యక్తి లేదా సంస్థను మోసం చేసి వారి నుంచి డబ్బు, ఆస్తి, విలువైన సమాచారాన్ని దొంగిలించడానికి వివిధ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మాధ్యమాలను ఉపయోగించడం) ఆరోపణలపై ఆయనతో పాటు సహచర నిందితులైన ఐదుగురిపై నమోదు చేసిన అభియోగాల ఉపసంహరణకు అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలను ఫెడరల్ జడ్జి తిప్పికొట్టారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై నమోదైన సెక్యూరిటీలు, వైర్ మోసం అభియోగాలను గత నెల 10న న్యూయార్క్ ఈస్ట్రన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి నికొలస్ గరాఫస్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. నిందితులపై వచ్చిన ఆరోపణలపై తమ అధికారులు దర్యాప్తు జరిపారని భారత్ తెలిపిందని, అయితే మంత్రిత్వ శాఖ ఉదహరించిన భారత న్యాయ ఉత్తర్వులు దీనికి విరుద్ధంగా ఉన్నాయని న్యాయమర్తి తెలిపారు.
అదానీలు, వినీత్ జైన్‌పై గత నెలలో అభియోగాలను కొట్టివేసిన న్యాయస్థానం మిగిలిన ఐదుగురు నిందితులపై మోసిన అభియోగాల విషయంలో తీర్పును రిజర్వ్ చేసింది. అభియోగాలను ఎందుకు కొట్టివేయాలో సవివరంగా కారణాలతో తెలియజేయాలని న్యాయ శాఖను ఆదేశించింది. తాత్కాలిక డిప్యూటీ ఆటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ట్రెంట్‌కాటర్ గత నెల 11, 14 తేదీల్లో పంపిన లేఖల్లో ఎలాంటి కొత్త ఆధారాలు లేవని న్యాయమూర్తి తన తాజా రూలింగ్‌లో ఎత్తిచూపారు. అభియోగాలు నమోదైన సహ నిందితులలో పునరుద్పాదక ఇంధన కంపెనీ అజూర్ పవర్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు గుప్తా, రూపేష్ అగర్వాల్‌తో పాటు అజూర్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న కెనడా పెన్షన్ నిధిలో మాజీ ఎగ్జిక్యూటివ్‌లు అయిన కబానెస్, సౌరభ్ అగర్వాల్, మల్హోత్రా ఉన్నారు.








కామెంట్‌లు (0)