ముంబయి: విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పిఐ)లు భారత మార్కెట్లపై మోహం చాటేస్తున్నారు. దేశీయంగా పెద్ద సానుకూలతలు కానరాకపోవడానికి తోడు అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా వడ్డీ రేట్లు, బాండ్ల రాబడులు పెరగడం, ముడిచమురు ధరలు అధికంగా ఉండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు సెప్టెంబరులో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.35,860 కోట్లను ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 1న మరో రూ.9,232 కోట్లను వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల నుంచి ఎఫ్‌పిఐల ఉపసంహరణలు దాదాపు రూ.2.7 లక్షల కోట్లకు చేరినట్లు సిడిఎస్‌ఎల్ గణాంకాలు వెల్లడించాయి. హర్మూజ్‌కు సంబంధించిన సరఫరా ముప్పులు, రూపాయి బలహీనత, అమెరికా బాండ్ల అధిక రాబడుల ప్రభావంతోనే ఈ ఉపసంహరణలు పెరిగాయని ఆల్ఫా ఎఎంసి సిఇఒ రాజేష్ సింగ్లా తెలిపారు.
నెలలో రూ.35,860 కోట్ల ఎఫ్‌పిఐలు ఉపసంహరణ..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 10:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)