శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగెయిల్‌ లాభాలు రెట్టింపు...

17 గంటల క్రితం

గెయిల్‌ లాభాలు రెట్టింపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ గ్యాస్ పంపిణీ సంస్థ గెయిల్ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో సహజ వాయువు మార్కెటింగ్ విభాగం వృద్ధితో లాభాలు రెట్టింపునకు పైగా పెరిగి రూ.4,650 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,217 కోట్లుగా ఉంది. క్రితం క్యూ2లో గ్యాస్ మార్కెటింగ్ ఆదాయం 31 శాతం పెరిగి రూ.41,226 కోట్లకు చేరగా, పెట్రోకెమికల్స్, ట్రాన్స్‌మిషన్ విభాగాల రాబడులు కూడా మెరుగవ్వడంతో ఆపరేటింగ్ ఆదాయం 30 శాతం ఎగబాకి రూ.45,924 కోట్లకు చేరుకుంది. అలాగే అనుబంధ సంస్థ గెయిల్ గ్యాస్‌‌ను ఐపిఒ ద్వారా స్టాక్ మార్కెట్లలోకి తీసుకొచ్చేందుకు డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్