గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతగ్గిన హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంక్‌ ర్యాంక్‌..

4 గంటల క్రితం

HDFCBankLogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • టాప్‌లోకి భారతీ ఎయిర్‌‌టెల్‌

ముంబయి : భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా కొనసాగిన హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంక్‌ ఈసారి అగ్రస్థానాన్ని కోల్పోయింది. కాంతర్‌ 2026 బ్రాండ్‌జెడ్‌ ర్యాంకింగ్స్‌లో ఎయిర్‌టెల్‌ దూసుకురావడంతో హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంక్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఆ బ్యాంక్‌ బ్రాండ్‌ విలువ 35.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఎయిర్‌టెల్‌ 43.2 బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో తొలిసారిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దేశంలోని టాప్‌ 100 బ్రాండ్ల మొత్తం విలువ ఏడాదిలో 12 శాతం తగ్గి 460.3 బిలియన్‌ డాలర్లకు చేరడం ఈ ర్యాంకింగ్స్‌లో మరో కీలక పరిణామం. టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లోని బ్రాండ్ల విలువ తగ్గడం ఈ క్షీణతకు ప్రధాన కారణమని కాంతర్‌ పేర్కొంది. బ్రాండ్‌ విలువలో తగ్గుదల, ర్యాంకుల్లో మార్పులు భారతీయ బ్రాండ్ల మధ్య పెరుగుతున్న పోటీని సూచిస్తున్నాయి. టాప్‌ 100 బ్రాండ్ల మొత్తం విలువలో ఆర్థిక సేవల రంగం 29 శాతం వాటాతో అతిపెద్ద విభాగంగా ఉన్నప్పటికీ.. ఈ రంగంలోని కొన్ని సంస్థల బ్రాండ్‌ విలువలు తగ్గాయి. ప్రపంచ టాప్‌ 100 బ్రాండ్లలో భారత్‌ నుంచి ఎయిర్‌టెల్‌, హెచ్‌డిఎఫ్‌‌సి బ్యాంక్‌, టిసిఎస్‌ చోటు దక్కించుకున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్