శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసౌర పరికరాల దిగుమతులు తగ్గొచ్చు..!

2 రోజుల క్రితం

solar.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 2030 నాటికి 7.4 లక్షల ఉద్యోగాలు : ఐఎస్‌ఎంఎ

న్యూఢిల్లీ : దేశంలో సౌర విద్యుత్‌ పరికరాల తయారీని భారీగా విస్తరించడం ద్వారా ​2047 నాటికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు 32.3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఆ పరిశ్రమ లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఏటా సుమారు 4.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్న సౌర పరికరాల దిగుమతి బిల్లును 2040ల ప్రారంభం నాటికి 95 శాతానికి పైగా తగ్గించవచ్చని ఇండియన్‌ సోలార్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఎ) అంచనా వేసింది. ఈ లక్ష్య సాధనకు దేశీయ తయారీ రంగంలో 2047 వరకు 89 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. మంగళవారం విడుదల చేసిన ‘సోలార్‌ మాన్యుఫాక్చరింగ్‌ విజన్‌ 2047’ నివేదికలో ఈ అంచనాలను వెల్లడించింది. ఈ విజన్‌ ప్రకారం ప్రస్తుతం సుమారు 171 గిగావాట్లుగా ఉన్న దేశ సౌర విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 2047 నాటికి 2,275 గిగావాట్లకు చేరవచ్చు. ప్రస్తుత విధానాలు యథాతథంగా కొనసాగితే ఈ సామర్థ్యం 1,370 గిగావాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. సౌర తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలు 2030 నాటికి 7.4 లక్షలకు, 2047 నాటికి 32.3 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్