ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అలాస్కా ఎయిర్‌‌లో ఉద్వాసనలు..

17 గంటల క్రితం

Layoffs at Alaska Air..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 10:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విమాన ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ వ్యయాల భారం నేపథ్యంలో అలాస్కా ఎయిర్ గ్రూప్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దాదాపు 200 మంది నాన్‌మేనేజ్‌మెంట్, నాన్‌కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సిఇఒ బెన్ మినికుచ్చి ఉద్యోగులకు పంపిన అంతర్గత లేఖలో వెల్లడించారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో విమాన ఇంధన ధరలు పెరగడంతో సంస్థపై ఆర్థిక ఒత్తిడి తీవ్రమైందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ఈ ఏడాది సుమారు 70 కోట్ల డాలర్ల మేర సర్దుబాటు నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా వేశారు. గత కొన్నేళ్లుగా ఆదాయానికి మించి వ్యయాలు పెరిగాయని, సంస్థ ఆర్థిక క్రమశిక్షణను తిరిగి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్