శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionNvidia సిఇఒ జెన్సన్‌ హువాంగ్‌ రాజీనామా

8 గంటల క్రితం

ఎన్విడియా సిఇఒ జెన్సన్‌ హువాంగ్‌ రాజీనామా
తాత్కాలిక బాస్‌‌గా కోలెట్‌ క్రెస్‌ 
13 శాతం పతనమైన కంపెనీ షేర్లు image 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తాత్కాలిక బాస్‌‌గా కోలెట్‌ క్రెస్‌

  • 13 శాతం పతనమైన కంపెనీ షేర్లు

శాన్‌‌ఫ్రాన్సిస్కో : దిగ్గజ ఎఐ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా కంపెనీ వ్యవస్థాపకుడు, సిఇఒ జెన్సన్‌ హువాంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన గురువారం ప్రకటించారు. సిఇఒ, అధ్యక్ష పదవులతో పాటు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యత్వం నుంచి కూడా వైదొలిగారు. సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సిఎఫ్‌ఒ) కోలెట్‌ క్రెస్‌ను తాత్కాలిక సిఇఒగా నియమించినట్లు ఎన్విడియా వెల్లడించింది. శాశ్వత సిఇఒ ఎంపిక కోసం అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించనున్నట్లు తెలిపింది. సంస్థ బోర్డుకు తొలిసారిగా చైర్మన్‌గా హార్వీ సి. జోన్స్‌ను నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అమెరికా మార్కెట్లో ఎన్విడియా షేర్లు 13 శాతం కుప్పకూలాయి. హువాంగ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వెలువడిన కథనాల నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త సారథి కోలెట్‌ క్రెస్‌ 2013 సెప్టెంబర్‌ నుంచి ఎన్విడియా సిఎఫ్‌ఒగా పనిచేస్తున్నారు. కంపెనీ ఆర్థిక కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె.. తాత్కాలిక సిఇఒగా బాధ్యతలు చేపట్టనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్