ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో వివిధ బాండ్లు (డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల) ద్వారా రూ. 60,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిధులను భారతీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పబ్లిక్ ఆఫర్ లేదా ప్రయివేటు ప్లేస్‌మెంట్ విధానంలో లాంగ్-టర్మ్ బాండ్లు, బాసెల్3-కంప్లియంట్ బాండ్ల రూపంలో రూపాయి లేదా ఇతర కరెన్సీలలో సమీకరించనున్నట్లు ఆ బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రకటనతో గురువారం బిఎస్‌ఇలో ఎస్‌బిఐ షేర్ 1,64 శాతం పెరిగి రూ.1,042.85 వద్ద ముగిసింది.
రూ.60వేల కోట్లు సమీకరించనున్న ఎస్‌బిఐ
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)