మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్మార్ట్‌ఫోన్ల ధరల బాదుడు

5 గంటల క్రితం

స్మార్ట్‌ఫోన్ల ధరల బాదుడు
19 శాతం మేర పెంచిన కంపెనీలు
సామ్‌‌సంగ్‌, షావోమి అమలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 12:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 19 శాతం మేర పెంచిన కంపెనీలు

  • సామ్‌‌సంగ్‌, షావోమి అమలు

​న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్‌ ‌కంపెనీలు సామ్‌‌సంగ్‌, షావోమి భారత్‌లో తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఈ రెండు కంపెనీలు కలిపి 41 వేరియంట్ల ధరలను సవరించాయి. షావోమి ఫోన్లపై గరిష్ఠంగా 18.75 శాతం, సామ్‌‌సంగ్‌ ఫోన్లపై 9.52 శాతం వరకు ధరలు పెరిగాయి. మెమరీ చిప్‌ల కొరత, విడిభాగాల ధరలు భారీగా పెరగడం ఈ నిర్ణయానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

‌సామ్‌‌సంగ్‌ తన గెలాక్సీ ఎఫ్‌, ఎ సిరీస్‌లలోని 22 వేరియంట్ల ధరలను గరిష్ఠంగా రూ.2,000 వరకు పెంచింది. ఈ పెంపు 3.13 శాతం నుంచి 9.52 శాతం మధ్య ఉండగా.. సగటున 5.36 శాతం మేర ధరలు పెరిగాయి. షావోమి రెడ్‌మీ ఎ7, 15సి, 17, నోట్‌ 17, నోట్‌ 17 ప్రో, నోట్‌ 17 ప్రో మాక్స్‌ తదితర మోడళ్లలో 19 వేరియంట్ల ధరలను పెంచింది. ఈ ఫోన్ల ధరల పెంపు 4.26 శాతం నుంచి 18.75 శాతం వరకు ఉండగా.. సగటున 10.02 శాతంగా నమోదయ్యింది. కొన్ని విడిభాగాల ధరలు 300 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. పాత తరం చిప్‌సెట్ల వినియోగం, టెలిఫోటో కెమెరా లెన్స్‌ వంటి ఖరీదైన ఫీచర్ల తొలగింపు, ఒఎల్‌ఇడి స్క్రీన్లకు బదులుగా ఎల్‌సిడి ప్యానెళ్ల వినియోగం వంటి మార్పులు చేస్తున్నాయి. గత 18 నెలల్లోనే స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు పలుమార్లు ధరలను పెంచినప్పటికీ, విడిభాగాల సరఫరా సమస్యలు తొలగిపోలేదు. మెమరీ చిప్‌ల కొరత 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని.. మరికొన్ని అంచనాల ప్రకారం 2029–30 వరకు కూడా కొనసాగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే వారాల్లో ఇతర స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు కూడా ధరలను పెంచే అవకాశముంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్