శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నో యూపిఐ డేకు విశేష మద్దతు

5 గంటల క్రితం

నో యూపిఐ డేకు విశేష మద్దతు 
దేశవ్యాప్తంగా వ్యాపారుల నిరసన
క్యూఆర్‌ కోడ్‌లకు నల్లటి వస్త్రాలు..
గుజరాత్‌లో 600 వ్యాపార సంఘాల భాగస్వామ్యం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 08:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దేశవ్యాప్తంగా వ్యాపారుల నిరసన

- క్యూఆర్‌ కోడ్‌లకు నల్లటి వస్త్రాలు..

- గుజరాత్‌లో 600 వ్యాపార సంఘాల భాగస్వామ్యం

న్యూఢిల్లీ: యుపిఐ చెల్లింపులపై ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్‌)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల వ్యాపారులు శుక్రవారం ‘నో యుపిఐ డే’ పాటించారు. దుకాణాల్లోని యుపిఐ క్యూఆర్‌ కోడ్‌లను నల్లటి వస్త్రాలతో కప్పివేశారు. వినియోగదారులు నగదు చెల్లింపులు చేసి సహకరించాలని కోరారు. రూ.2,000కు మించిన కొన్ని పెద్ద మర్చంట్ యుపిఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండిఆర్‌ విధించే ప్రతిపాదనను వ్యాపార సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పూణె మర్చంట్స్ ఛాంబర్, ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అసోసియేషన్స్ ఆఫ్ పుణె, ఢిల్లీ మొబైల్ అసోసియేషన్, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ తదితర సంఘాల పిలుపుతో వ్యాపారులు యుపిఐ చెల్లింపులను నిలిపివేశారు. అహ్మదాబాద్‌తో పాటు రాజ్‌కోట్‌, వడోదరలోనూ నిరసనలు చేపట్టారు. ఇప్పటికే జిఎస్‌‌టి వంటి పన్నులు చెల్లిస్తున్న తమపై యుపిఐ ఎండిఆర్‌ అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భారాన్ని చివరికి వినియోగదారులపైనా మోపాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ వంటి ప్రధాన మార్కెట్లలోనూ నిరసనలు కొనసాగాయి. మరోవైపు ఢిల్లీలోని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ నిరసనలో పాల్గొనలేదు. ఎండిఆర్‌ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

గుజరాత్‌లో నిరసనకు సుమారు 600 వ్యాపార సంఘాలు మద్దతు తెలపడం విశేషం. అహ్మదాబాద్‌తో పాటు రాజ్‌కోట్‌, వడోదరలో వ్యాపారులు క్యూఆర్‌ యంత్రాలను నల్లటి వస్త్రాలతో కప్పి ‌నో యుపిఐ అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఆటోమొబైల్‌, మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, వస్త్ర, నగల రంగాలకు చెందిన వ్యాపారులు కూడా నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 2న సుమారు రూ.50 కోట్ల విలువైన లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార సంఘాలు అంచనా వేశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్