ముంబయి : ఆగస్టు 18న జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం)పై అనిశ్చితి నెలకొంది. టాటా సన్స్‌లో 23.56 శాతం వాటా ఉన్న సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టిటి) తన ప్రతినిధిని నామినేట్ చేయలేకపోవడమే ఇందుకు కారణం. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షల కారణంగా ఎస్‌ఆర్‌టిటి బోర్డు సమావేశం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డిటిటి)తో కలిసి ఎజిఎంకు ప్రతినిధిని నియమించే అవకాశం లేకుండా పోయింది. టాటా సన్స్ ఆర్టికల్ 86 ప్రకారం.. టాటా ట్రస్టులు కలిపి 40 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నంతకాలం ఎజిఎం కోరమ్‌కు ఎస్‌ఆర్‌టి, ఎస్‌డిటిటి సంయుక్తంగా నామినేట్ చేసిన ప్రతినిధి హాజరు కావాలి. ఈ రెండు ట్రస్టులకు కలిపి టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉంది. ప్రతినిధి లేకపోతే కోరమ్ పూర్తి కాకపోవచ్చని, అటువంటి పరిస్థితిలో సమావేశాన్ని వాయిదా వేయాల్సి రావచ్చని సమాచారం. ఇదే సమయంలో ఎన్. చంద్రశేఖరన్ డైరెక్టర్ పదవిపై కూడా ఎజిఎంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
టాటా సన్స్ ఎజిఎంపై అనిశ్చితి..
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)