బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెట్రో నగరాలకు వీ-రిచ్‌ జింజర్‌ హనీ

11 గంటల క్రితం

honey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌: క్లీన్‌ లేబుల్‌ బ్రాండ్‌ వీ-రిచ్‌ తన జింజర్‌ హనీ ఉత్పత్తిని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై సహా ప్రధాన మెట్రో నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అమెజాన్‌, బ్లింకిట్‌ ద్వారా ఈ ఉత్పత్తిని విక్రయిస్తోన్నట్లు పేర్కొంది. తాజా అల్లం ముక్కలు, తేనెతో తయారు చేసిన ఈ ఉత్పత్తిలో చక్కెర పాకం, కృత్రిమ పొడులు, సింథటిక్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌ కలపలేదని సంస్థ వెల్లడించింది. వేడినీరు లేదా టీలో ఒక చెంచా జింజర్‌ హనీ కలుపుకోవడం ద్వారా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. వీ-రిచ్‌ వ్యవస్థాపకురాలు, సీఈఓ యోగిత జాహ్నవి మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాల్లో అల్లం, తేనెకు ప్రత్యేక స్థానం ఉందని, తాజా అల్లాన్ని ప్రతిసారీ సిద్ధం చేసే శ్రమను తగ్గించేందుకు జింజర్‌ హనీని రూపొందించినట్లు తెలిపారు. ఈ ఉత్పత్తి 250 మి.లీ., 500 మి.లీ. ప్యాక్‌లలో సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుందని పేర్కొన్నారు. అమెజాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్డర్లు చేయవచ్చని, హైదరాబాద్‌, బెంగళూరులో బ్లింకిట్‌ ద్వారా 250 మి.లీ. ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్