ప్రజాశక్తి - హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2026 ప్రారంభమైంది. అక్టోబర్ 26 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎండిసి డైరెక్టర్ (టెక్నికల్) వినయ్ కుమార్ అధికారులు, ఉద్యోగులతో నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు. సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అనంతరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సందేశాలను సీనియర్ అధికారులు చదివి వినిపించగా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ సందేశాన్ని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చదివారు. ఎన్ఎండిసి ప్రాజెక్టు యూనిట్లలోనూ సంబంధిత అధిపతుల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చర్యలు, నైతిక పాలన, నిజాయితీతో కూడిన సంస్థాగత సంస్కృతిని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని ఎన్ఎండిసి తెలిపింది.
Print Editionఎన్ఎండిసిలో విజిలెన్స్ వారోత్సవాలు..
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026, 09:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)