గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌బిఐ యోనోలో ఎఫ్‌డి ఆధారిత క్రెడిట్ కార్డులు

5 గంటల క్రితం

ఎస్‌బిఐ యోనోలో ఎఫ్‌డి ఆధారిత క్రెడిట్ కార్డులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బిఐ యోనో వేదికపై ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత ‘సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్‌బిఐ కార్డ్’ను ఎస్‌బిఐ ప్రవేశపెట్టింది. ఎస్‌బిఐలో ఎఫ్‌డీ ఉన్న వినియోగదారులు యోనో యాప్ ద్వారా 10 నిమిషాల్లో.. పూర్తిగా కాగిత రహిత విధానంలో నాలుగు రకాల కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలైట్, ప్రైమ్, సింప్లీక్లిక్, సింప్లీసేవ్ కార్డులు అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సిఇఒ సలిల పాండే తెలిపారు. ఈ విధానం ద్వారా ఎఫ్‌డీ ఆధారిత భద్రతా క్రెడిట్ కార్డును నిమిషాల్లో పొందే అవకాశం ఉంటుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్