దసరా పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి మా స్కూల్లో దసరా సంబరాలను ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకున్నాం. పండుగ సందర్భంగా స్కూలు ఆవరణను రంగురంగుల పూలు, తోరణాలు, కాగితపు అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. స్కూలంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. దసరా సందర్భంగా మా టీచర్లు విజయదశమి ప్రాముఖ్యతను, దసరా పండుగ విశిష్టతను మాకు వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటామని చెప్పారు. నా తోటి విద్యార్థినీ విద్యార్థులు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, దుర్గాదేవి, రావణుడు వంటి వేషధారణల్లో అలరించారు. రంగురంగుల దుస్తుల్లో వచ్చిన మేము దాండియా ఆడి సందడి చేశాము. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి, పాటలు పాడుతూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నాం. ఆయుధ పూజలో పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్లు వంటి వస్తువులను గౌరవంగా పూజించాం. మా స్కూల్లో జరిగిన దసరా సంబరాలు నాకు ఎంతో నచ్చాయి. ఈ వేడుకల ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతి, మంచి విలువల గురించి తెలుసుకున్నాం. చెడును వదిలి మంచిని ఎంచుకోవాలని నేర్చుకున్నాం. మా కరస్పాండెంట్ వల్లభనేని మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ వల్లభనేని నాగలక్ష్మి , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చెడుపై మంచి విజయం సాధించిన దసరా స్ఫూర్తితో.. మంచి ఆలోచనలతో ముందుకు సాగుదాం!
వెన్నెల సహస్ర
1వ తరగతి, బచపన్ ప్లే స్కూలు,
తాడేపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా








కామెంట్లు (0)