అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉన్నాడు. అతడి పేరు బాలు. ఓ రోజు వాళ్ళ నాన్నతో కలిసి బయటికి వెళ్తాడు. ‘బయట ఏదైనా బొమ్మ కొనివ్వు నాన్నా!’ అని అడగ్గా ‘అలాగే.. కొనిస్తాలే’ అని తండ్రి సమాధానం ఇచ్చాడు. ఒకచోట ఒకతను రంగురంగుల కోడిపిల్లలు అమ్మడం చూస్తాడు బాలు. అది చూసిన బాలు వాటిని కొందాం అంటాడు. దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అయినా బాలు అవే కావాలని ఏడుస్తాడు. కానీ వాళ్ళ నాన్న ‘వాటిని చూసుకోవడానికి వీలు కాదు వద్దు, సరిగ్గా చూసుకోకపోతే చనిపోతాయి. వాటికి తల్లి కూడా లేకుండా ఎలా పెరుగుతాయి. కావాలంటే ఒక బొమ్మ కొంటాను’ అంటాడు. కానీ బాలు వినకుండా అలాగే ఏడుస్తూ ఉంటాడు. ఇక తప్పదు అని రెండు కోడిపిల్లలను కొంటాడు. బాలు ఎంతో సంతోషంతో వాటిని ఇంటికి తీసుకెళ్లి ఆడుకుంటాడు. తినడానికి ఆ కోడిపిల్లలకు కొన్ని గింజలు, అన్నం వేసినా అవి ఒక్కోసారి తినేవి, తినడానికి రాక అటూఇటూ తిరిగేవి. వాటికి ఏం పెట్టాలో అర్థం కాదు బాలుకు. కొన్నిరోజులకే అవి ఏం తినలేక చనిపోతాయి. చాలా బాధపడతాడు బాలు. నాన్న చెప్పింది నిజమే. వాటికి తల్లి ఉంటే ఆలనా.. పాలనా చూసేది. అది లేకపోవటంతో చనిపోయాయి అంటూ బాధపడ్డాడు బాలు.
ఎస్. బలరాం తేజ
6వ తరగతి,తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,_
దేవరకద్ర, మహబూబ్ నగర్.








కామెంట్‌లు (0)