శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతు ప్రేమ

17 నవంబర్, 2026

జంతు ప్రేమ image 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 04:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జంతు ప్రేమ

త్రిపురగిరి గ్రామంలో రామయ్య, రంగమ్మ అనే దంపతులు ఒక లేగ దూడను కొత్తగా తెచ్చుకున్నారు. దాన్ని చూసి వాళ్ల కూతుళ్లు సీత, గీత చాలా సంతోషించారు. రోజూ పాఠశాలకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఆహారం గురించి ఇద్దరూ ఆలోచించేవారు. ఒక రోజు పాఠశాలలో ‘జంతు ప్రేమ’ అనే పాఠం చెప్పారు. హానికరం కాని జంతువులను ప్రేమగా చూసుకుంటే, అవి మనతో స్నేహం చేస్తాయని మాస్టారు చెప్పారు. సీత, గీతకు ఆ మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఇంటికి వచ్చి వాళ్ల అమ్మను అడిగారు. ‘మాస్టారు చెప్పింది నిజమే. మీరు మన లేగదూడను ప్రేమగా చూసుకుంటున్నారు కదా! అది కొంచెం పెద్దయ్యాక మీతో పాటు ఆడుతుంది. గెంతుతుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడకు మీతో పాటు వస్తుంది’ అని చెప్పింది. మాస్టారు చెప్పినప్పటి కంటే అమ్మ చెప్పే మాటలను సీత, గీత కళ్లు ఇంత పెద్దవి చేసుకుని మరీ విన్నారు. ఆ రోజు నుంచి లేగ దూడను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కొన్ని రోజులకు అది పెద్దదైంది. వాళ్లతో పాటు గెంతులు వేసింది. బడికి వెళ్లేటప్పుడు వాళ్ల వెనకాలే వెళ్లేది. బలవంతంగా గుంజకు కట్టి మరీ స్కూలుకు వెళ్లాల్సి వచ్చేది. ఒక జంతువు తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ఆ చిన్నారి మనసులు ఎంతో ఆనందించాయి.

జంతు ప్రేమ image 1

​- బి.తనూ శ్రీ, 9వ తరగతి,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

అనంత సాగర్, సిద్దిపేట జిల్లా.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్