గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాకు నచ్చిన పుస్తకం

1 గంట క్రితం

BOOK
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ‌ఫ్రెండ్స్‌,
నేను ఇటీవల ‘గేయ కుసుమాలు’ అనే పిల్లల పుస్తకం చదివాను. అది చాలా బాగుంది. ‘బాలబంధు’ డాక్టర్ నేమిలేటి కిట్టన్న అందులో చాలా బాల గేయాలు రాశారు. ఆయన ఈ పుస్తకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చారు. ఆ పుస్తకంలో ‘ఎవరి అమ్మభాష వాళ్లకు గొప్ప. అమ్మ భాషను మరువద్దు’ అంటూ ‘అమ్మ భాషకు జేజేలు’ అనే గేయం నాకు బాగా నచ్చింది. ఇంకా అందులో గురువులు మనం చీకట్లో ఉన్నప్పుడు మనలను వెలుగులోకి తెస్తారు. మనకు జ్ఞానం పంచి ప్రతిభను పెంచి భవితకు పునాది వేస్తారు’ అని చెబుతూ ‘గురువులకు దండాలు’ అనే గేయం కూడా ఉంది. మరో గేయం ‘క్షమించే గుణం’లో క్షమించే గుణం నీకు లేకుంటే ఈ లోకంలో ఉన్న శత్రువులు మొత్తం నీ వెంటే ఉంటారు అని రాశారు. ఇలా చాలా గేయాలు అందులో ఉన్నాయి. అవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం 52 గేయాలు అందరూ చదవాల్సినవి. ఈ పుస్తక ముఖచిత్రం కూడా నాకు బాగా నచ్చింది. ముఖచిత్రం చూడగానే ‘ఈ పుస్తకం చదవాలి’ అన్న కోరిక నాలో బలంగా ఏర్పడింది. ఈ పుస్తకంలోని పేజీల సంఖ్య 70, పుస్తకం ధర వంద రూపాయలు. ఇలాంటి గేయాలు రచనలు మరెన్నో కవి కిట్టన్న గారి కలం నుండి జాలువారాలని నేను కోరుకుంటున్నాను.

పుస్తక ప్రతులకు : 94901 82636 నెంబర్లో సంప్రదించవచ్చు.

rishika

- కుమ్మరి రిషిక, 8వ తరగతి,
జడ్పీ స్కూల్ రాంపూర్, నిజాంపేట, మెదక్ జిల్లా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్