ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎందుకు చదువుకోవాలి?

3 గంటల క్రితం

rishitha katha photo(3).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒకరోజు సీత బడి నుంచి ఇంటికి వస్తూ తన స్నేహితురాలు రవళితో ‘అసలు మనం రోజు బడికి ఎందుకు వెళ్లాలి? ఎందుకు చదువుకోవాలి?’ అని అడిగింది. రవళికి ఆశ్చర్యం వేసింది. ‘అదేమి ప్రశ్న సీతా? బడిలో చదువుతో పాటూ.. మనకు సంస్కారం నేర్పిస్తారు. ఇతరులతో కలిసి మెలిసి ఉండడం మరెన్నో విషయాలను బడి నేర్పిస్తుంది. మనము చదువుకోవడం వల్ల జ్ఞానం కలుగుతుంది. అలాగే చదువుకోవడం వల్ల మన చుట్టూ పరిస్థితులు, సమాజ మార్పులు అర్థం అవుతాయి. ఉద్యోగం వస్తుంది. మనకు గౌరవం వస్తుంది' అని రవళి అంది.

సీతా మళ్లీ సందేహంగా ‘జ్ఞానం నుంచి చదువు పుట్టిందా? లేదా చదువు వల్ల జ్ఞానం కలుగుతుందా?’ సందేహం వ్యక్తం చేసింది. దాంతో రవళి కొంత ఆలోచించింది. ‘ తెలియదు సీతా, కానీ మంచి ప్రశ్న వేశావు. రేపు మనం మన ఉపాధ్యాయురాలు అడిగి తెలుసుకుందాం.’ అంది. మనసటి రోజు పిల్లలందరూ బడికి వచ్చారు. బడికి వెళ్ళగానే సీతా, రవళి టీచర్ దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నను అడిగారు.

దానికి టీచర్.. ‘మంచి ప్రశ్న సీతా! చదువు వల్ల జ్ఞానం కలుగుతుందన్నమాట నిజం. చదువుకున్న వారికి ఏది మంచి, ఏది చెడు తెలుస్తాయి, సమాజం మనల్ని గౌరవిస్తుంది. మంచి స్థానంలో ఉంటాము. మంచి గుర్తింపు కలుగుతుంది’అంది. ‘సరే టీచర్ ! నాకు ఇప్పుడు అర్థమైంది’ అన్నారు సీత, రవళి. అప్పుడు సీత, రవళితో.. ‘నేను ఎందుకు చదువుకోవాలో నాకు ఇప్పుడు బాగా తెలిసింది’ అంది. అందుకే మనకు వచ్చిన సందేహాలను వెంటనే పెద్దలను అడిగి తెలుసుకోవాలి అనుకున్నారు.

సిహెచ్ రిషిత 9వ తరగతి,

అరవింద మోడల్ స్కూల్,

మంగళగిరి, గుంటూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్