ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

80 కేజీల గంజాయి పట్టివేత

15 గంటల క్రితం

80 కేజీల గంజాయి పట్టివేత
ఇద్దరు నిందితుల అరెస్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇద్దరు నిందితుల అరెస్టు

ప్రజాశక్తి – మారేడుమిల్లి : మారేడుమిల్లి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి 80 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయితో పాటు తరలింపునకు ఉపయోగించిన ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మారేడుమిల్లి ఎస్‌ఐ కె. శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి మారేడుమిల్లి శివారు వేటుకూరు జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి తనిఖీ చేయగా వారి వద్ద 80 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులను మల్కాన్‌గిరి జిల్లా, ఒడిశా రాష్ట్రానికి చెందిన అజయ్‌కుమార్‌ సన్య, కోరాపుట్‌ జిల్లాకు చెందిన రాజేంద్ర హరిజన్‌గా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి గంజాయితో పాటు ఒక ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రంపచోడవరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును మారేడుమిల్లి సీఐ బి.నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరికొంతమంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్