ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామంలో స్కూల్ పెట్టండి : విద్యార్థుల తల్లిదండ్రుల వినతి

26 జూన్, 2026

Set up a school in the village: Request from students' parents.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనంతగిరి (అల్లూరి సీతారామరాజు) : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయితీ గాదిలోవ గ్రామంలో ఉన్న బడిలో 24 మంది పిల్లలు చదువుతున్నారు. మూర్లోవ పెద్దగుడ్ల గ్రామానికి చెందిన 20 మంది పిల్లలు ఉన్నారు. గాదిలోవ స్కూల్ ని చిన్న రాబా. గాదిలోవ సరిహద్దు. వద్ద నలుగురు పిల్లల కోసం గాదిలో స్కూల్ ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల మొరలోవా. పెద్దగుడ్లే. గ్రామాల నుండి చిన్నరాబా వద్ద స్కూల్ కి వెళ్లాలంటే 3 మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుంది. ఎండలు విపరీతంగా పెరగడంతో స్కూల్ కి వెళ్ళాలంటే పిల్లలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. గతంలో గాదుల్లో గ్రామంలోనే చెట్టు కింద పాఠశాల నిర్వహించేవారు. నేడు పాఠశాలనే చినరాబాకు మార్చడం వల్ల ... తాము అనేక ఇబ్బందులు గురవుతావని, ఎంఈఒ ఫిర్యాదు చేస్తే స్థానిక జడ్పిటిసి డి.గంగరాజు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇద్దరు వచ్చి. గాదిలో గ్రామంలో స్కూలు షెడ్ నిర్మాణం చేసుకోండి అని చెప్పారని, దీంతో గ్రామస్తులు అందరు కలిపి పాక నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. కొందరు దుండగులు కావాలని ఆ పాకను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుండి తమ పిల్లలు స్కూల్ కి వెళ్లడం లేదని చెప్పారు. తక్షణమే గాదిలోవలో స్కూలును ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. గాదిల్లోవ స్కూల్ కి స్థలం చూపించాలని, షెడ్ నిర్మాణం చేసుకుంటామని వినతిలో తెలిపారు. ఎంఆర్ఒ కు ఈ విషయమై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనీ, ఇప్పటికైనా స్థలం చూపిస్తే స్కూల్ షెడ్డు నిర్మాణం చేస్తామని గ్రామస్తులు వేడుకున్నారు. సెంపి గోంగులు. చంపి సన్యాసి చంపి బాలయ్య కోటపర్తి గంగమ్మ. కోట్టపర్తి సిన్సన్యాసి కంసురి గంగులు. గ్రామస్తులు విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్