మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సభ బయటే టిడిపి కార్యకర్తలు - తీసుకొచ్చిన నేతలేమయ్యారు ?

24 జులై, 2026

TDP activists left outside the meeting—what happened to the leaders who brought them?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రంపచోడవరం (పోలవరం) : పోలవరం జిల్లా రంపచోడవరంలో ముఖ్యమంత్రి పర్యటన వేళ .... సిఎం చంద్రబాబుని కలవడానికి వచ్చిన కార్యకర్తలను సభా ప్రాంగణంలోనికి వెళ్లనీయకుండా పోలీసులు అటకాయిస్తూ గేటు నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. తామంతా సుదూర ప్రాంతాల నుండి వచ్చామని తమను లోపలికి వెళ్ళనీయండి అని టిడిపి కార్యకర్తలు వేడుకుంటున్నా పోలీసువారు మాత్రం ఎండలోనే వారిని నిలబెట్టారే తప్ప వారిని లోనికి వెళ్ళనివ్వడం లేదు. వారికి కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని తీసుకొచ్చిన నాయకులను అడుగుదామని చూస్తే వారు కూడా ఎవరూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా బయటకు వచ్చి వారి లోపలికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్