సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లోతా రామారావు ను జెడ్పిటీసి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన గిరిజన, ఆదివాసి, ప్రజా సంఘాల ఐక్యవేదిక

20 అక్టోబర్, 2026

Tribal, Adivasi, and People’s Organizations’ Joint Forum announces Lota Rama Rao as the consensus ZPTC candidate.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 11:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆదివాసీ జేఏసీ కన్వీనర్ వంతు బాలకృష్ణ మద్దతు..


ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరు) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే లోతా రామారావును రాజవొమ్మంగి మండల జెడ్పిటీసి అభ్యర్థి గా గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి గా ప్రకటించడం జరిగిందని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆదివాసీ జేఏసీ కన్వీనర్ వంతు బాలకృష్ణ మంగళవారం తెలిపారు. ఆదివాసి జేఏసి తొలిత తనను జడ్పిటిసి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, భవిష్యత్తు ఉద్యమాలు కోసం వెనక్కి తగ్గి లోతా రామారావు మద్దతు తెలపడం జరిగిందని వంతు బాలకృష్ణ వెల్లడించారు. సోమవారం రాత్రి రాజవొమ్మంగిలో గిరిజన, ఆదివాసి ప్రజా సంఘాల ఐక్యవేదిక సమావేశం లోతా రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన గిరిజన ఆదివాసి సంఘాల ఐక్యవేదిక మండల కన్వీనర్ వంతు బాలకృష్ణ, పలువురు ఆదివాసీ నేతలు మాట్లాడుతూ .... లోతా రామారావు నిస్వార్ధంగా ఏజన్సీ లో ఆదివాసి హక్కులు, చట్టాలు,పరిరక్షణ 1/70 యాక్ట్, జీవో నెంబర్ 3 అమలు కోసం,అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయుల, కార్మికుల ఏజెన్సీ లో ఉన్న సాధారణ, నిరుపేద ప్రజానీక సమస్యల పరిష్కారం కోసం, ఏజెన్సీ ప్రాంత పల్లెల్లో నెలకొన్న రహదారులు, విద్యా, వైద్యం వంటి మౌలిక వసతుల కోసం నిరంతరం పోరాడతాడు అనే ఉద్దేశంతో లోతా రామారావుకు తమ పూర్తి మద్దతు ప్రకటించినట్లు వంతు బాలకృష్ణ తెలిపారు. ఆదివాసి నాయకత్వం అందరం ఐక్యంగా అఖండ మెజార్టీతో గెలిపించేలా కృషి చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ ... ఎన్నో ఏళ్లుగా ఆదివాసి హక్కుల కోసం, చట్టాల కోసం, గిరిజన ప్రాంత ప్రజల కోసం పోరాడుతున్న వంతు బాలకృష్ణ ను జేఏసీ తొలిత జడ్పిటిసి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, భవిష్యత్తు ఉద్యమాలు కోసం తనను జడ్పిటిసి అభ్యర్థిగా బాలకృష్ణ ప్రకటించి మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రామారావు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపి, తమతో కలిసి పోరాటాలకు ముందుకెళ్తానని తెలిపారు. మండలంలో ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న నిస్వార్థ నాయకుడు లోతా రామారావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఆదివాసి ఐక్యవేదిక తరుపున ఎంపీటీసీ స్థానాల్లో కూడా తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసి ఐక్యవేదిక జిల్లా మండల నాయకులు ఎం అంజిరెడ్డి, జి నూకరాజు, జి లోవ ప్రసాద్, కె శివాజీ, పి సత్యనారాయణ, ఈ శ్రీను, ఆర్ వెంకటరెడ్డి, జి.నాగరాజు, బి.రామకృష్ణ, వై.రాంబాబు, కుమార్ వెంకటేష్, సిహెచ్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్