సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంజన్ లేకుండా 6 కిలోమీటర్లు వెళ్లిన ఏడు బోగీలు

1 గంట క్రితం

train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- తమిళనాడులో కొన్ని రైళ్లు ఆలస్యం

తమిళనాడు: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. జోలార్‌పేట జంక్షన్ రైల్వే యార్డులో ఇంజన్ లేకుండా నిలిపి ఉంచిన ఏడు ఖాళీ రైల్వే బోగీలు ఒక్కసారిగా కదిలి సుమారు 6 కిలోమీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లాయి. చివరకు తమలేరి ముత్తూరు సమీపంలోని ప్రధాన రైల్వే ట్రాక్‌పై పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించేందుకు గ్యాస్ కటింగ్ పరికరాలతో వాటి అనుసంధాన భాగాలను వేరు చేశారు. అనంతరం జేసీబీ యంత్రాల సహాయంతో బోగీలను రైల్వే పట్టాల నుంచి పక్కకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు-చెన్నై మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. బోగీలు వాటంతట అవే ఎలా కదిలాయి? అనే విషయంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో రైల్వే యార్డుల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్