సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యాపై సైబర్‌ దాడి

1 గంట క్రితం

Cyber attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మాస్కో : తమ అత్యవసర హెచ్చరికల యాప్‌ భారీ సైబర్‌ దాడికి గురైందని రష్యా సోమవారం పేర్కొంది. డ్రోన్‌ దాడులు, ఇతర ముప్పుల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి రూపొందించిన యాప్‌లో హ్యాకర్లు తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేశారని అత్యవసర సేవల శాఖ తెలిపింది. తమ యాప్‌పై సైబర్‌ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు. యాప్‌లో రేడియేషన్‌ ముప్పుకు సంబంధించిన నిరాధారమైన హెచ్చరికలు కనిపించాయని, దీంతో తమ వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థను హ్యాక్‌ చేసినట్లు అనుమానిస్తున్నామని ఉక్రెయిన్‌ తెలిపింది. సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ (ఎస్‌పిఆర్‌ఎవిడిఐ) తనపై జరిగిన హ్యాక్‌కు రష్యానే కారణమని ఉక్రెయిన్‌ ఆరోపించింది.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఇరు దేశాల మధ్య కొనసాగిన అత్యంత సుదీర్ఘమైన కాల్పుల విరమణ ఆదివారంతో ముగిసింది. ఉక్రెయిన్‌లోని తూర్పు ఖెర్సన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ కాల్పుల విరమణను పొడిగించాలన్న ప్రతిపాదనను రష్యా తిరస్కరించినట్లు కీవ్ వెల్లడించింది. ఈ కాల్పుల విరమణ ముగిసిన సమయంలోనే సైబర్ దాడులు చోటుచేసుకున్నాయని ఉక్రెయిన్‌ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్