- వైస్ చైర్ పర్సన్‌గా తీగల ప్రభ
ప్రజాశక్తి - పోలవరం : పోలవరం జిల్లా తొలి జెడ్పి చైర్‌పర్సన్ గా వంతల రాజేశ్వరి ఎంపిక కాగా, వైస్ చైర్‌పర్సన్‌గా తీగల ప్రభని నియమిస్తూ టిడిపి అధిష్ఠానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అడ్డతీగల మండలం దాకోడు గ్రామానికి చెందిన రాజేశ్వరి తొలుత ఎంపిపిగా పనిచేశారు. 2014లో ఎమ్మెల్యేగా వైసిపి నుంచి ఎన్నికై టిడిపిలో చేరారు. 2019లో టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పోలవరం జిల్లాలో టిడిపి బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానం రాజేశ్వరిని జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడంపై జిల్లా వాసులు అభినందలు తెలుపుతున్నారు. గంగవరం మండలానికి చెందిన తీగల ప్రభ గతంలో ఎంపిపిగా పనిచేశారు. డాక్టరేట్ కూడా పొందారు. మొదటి నుండి గంగవరం మండలంలో పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేశారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్‌పర్సన్‌కు గట్టి పోటీ వచ్చినా చివరకు తీగల ప్రభకు ఆ పదవిని కేటాయించడంపై పలువురు టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)