మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎం చంద్రబాబు కోసం 3 గంటలు పడిగాపులు ..!

24 జులై, 2026

Waiting for three hours for CM Chandrababu...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సీఎం చంద్రబాబు కోసం మూడు గంటలుగా ఎదురుచూపులు

  • మెగా పిటిఎం 4.0లో విద్యార్థులు తల్లిదండ్రులకు తప్పని అవస్థలు

  • వీడియో షూటింగ్లో సీఎం చంద్రబాబు బిజీ


ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి, రంపచోడవరం (అల్లూరి) : మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సభలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎదురుచూపులు తప్పలేదు. కార్యక్రమం నేపథ్యంలో  అధికార యంత్రాంగం ఉదయం 8 గంటలకే విద్యార్థులను తల్లిదండ్రులను సభా వేదిక వద్దకు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ... ఈరోజు ఉదయం 10.00 గంటలకు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి, 10.20 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 10.20 గంటల కార్యక్రమం ప్రారంభించి 11.30 గంటలకు ముగించాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం సభా ప్రాంగణం వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నప్పటికీ, స్కూల్ లో ఏర్పాటు చేసిన వీడియో షూటింగ్ కి అధిక ప్రధాన్యత ఇచ్చి ఎక్కువ సమయం అక్కడే గడిపారు. దీంతో తల్లితండ్రులు, విద్యార్థులలో అసహనం వ్యక్తమైంది. తల్లికి వందనం సభ 3 గంటలపాటు పడిగాపులు కాసింది.
photo


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్