ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్వాసితులకు కోర్టు ఆదేశాలు అమలు చేయాలి : నిర్వాసితులు, సిఐటియు

17 జులై, 2026

నిర్వాసితులకు కోర్టు ఆదేశాలు అమలు చేయాలి : నిర్వాసితులు, సిఐటియు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 02:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అనకాపల్లి : రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు, షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు బాండ్లు రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. మినిస్ట్రిరియల్ సూపరింటెండెంట్ రాజేశ్వరి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శంకర్రావు, నిర్వాసితుల సంఘం కో కన్వీనర్ కె. రామ సదాశివరావు మాట్లాడుతూ .... రోడ్డు విస్తరణలో నష్టపోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉండాలి కానీ నేటి ప్రభుత్వం పరిహారం కాకుండా టి డి ఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం అంటే నిర్వాసితులను మోసం చేయడమేనన్నారు. గత ప్రభుత్వం గజంకు రూ.18 వేల నుండి రూ. 25 వేలు ఇస్తామని అందరి ఆమోదం తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకుండా టిడిఆర్లు ఇస్తామని కొత్త ఆదేశాలు తీసుకొచ్చిందని చెప్పారు. దీనిపై నిర్వాసితులు కోర్టుకు వెళ్లారని కోర్టు ఆదేశాలు గ్రామీణ ప్రాంతంలో టిడిఆర్ బాండ్లు చెల్లవు అని నగదు పరిహారం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా నేటికీ దానిని అమలు చేయకుండా నిర్వాసితులను అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. రోడ్డు కిరువైపులా పంట కాలువల ను ధ్వంసం చేసి రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిర్వాసితులను మోసం చేస్తున్నారనీ, వెంటనే నష్టపోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి రోడ్డు, వంతెన పనులు పూర్తిచేయాలని కోరారు. రోడ్డు 100 అడుగులు తర్వాత నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం టు అనకాపల్లి నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్ రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు, ఎస్ బ్రహ్మాజీ , సిఐటియు నాయకులు కే సోము నాయుడు కాండ్రేగుల బాబురావు, ఆడారి శివ, ఎస్.కనుమునాయుడు , వేగి వెంకట అప్పారావు, తనకాల జగ్గారావు అచ్చుతాపురం, మునగపాక, అనకాపల్లి మండలాల నిర్వాసితులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్