సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

' తాగడానికి నీరివ్వండి` : ఆదివాసి మహిళల ఆందోళన

1 గంట క్రితం

'Give us water to drink': Adivasi women's protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రోలుగుంట (అనకాపల్లి) : ' తాగడానికి నీరివ్వండి` అంటూ ... ఆదివాసి కోంద్ మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పిత్రి గడ్డ. నీళ్లు బంద PVTG కొందు ఆదివాసి గిరిజనులు 26 కుటుంబాలు కొండ శిఖరం పై జీవనం సాగిస్తూ ఉన్నారు. తమ గ్రామాలకి గ్రావిటీ స్కీమ్స్ నిమిత్తం జిల్లా పరిషత్ నిధుల నుండి మే నెలలో 7 లక్షల 50 వేల రూపాయలు నిధులు మంజూరు జరిగాయనీ, తామెంతో సంతోషపడ్డామని కానీ... నేటికీ పనులు ప్రారంభించలేదు అని చెప్పారు. తమ కుళాయిలకి బురద నీరు వస్తుందన్నారు. కలుషిత నీటిని తాగడం వల్ల అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేక డోలు మోసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు తక్షణమే పనులు ప్రారంభించకపోతే ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని గ్రామ మహిళలు హెచ్చరించారు. ఈ ఆందోళనలో రాధమ్మ. గేమిల మణికుమారి. వంతల రాధా. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వారం రోజులుగా మంచినీటి సమస్య ఉందని, పనులు ప్రారంభించక పోతే. ఎంపీడీవో కార్యాలయం వద్ద బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని కే గోవిందరావు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు. పివిటిజి సంఘం అధ్యక్షుడు కొండతాంబలే వెంకట్రావు డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్