మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దళిత గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కి ప్రజాసంఘాల వినతి

07 ఆగస్టు, 2026

People's organizations submit a representation to the Tahsildar seeking resolution of issues in Dalit villages.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 02:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అచ్చుతాపురం (అనకాపల్లి) : వివక్షత లేని సమాజం కోసం సామాజిక శంఖారావం పేరుతో అచ్చుతాపురం మండలంలోని దళిత గ్రామల్లో సర్వేలు నిర్వహించి వచ్చిన సమస్యల పరిష్కరించాలని ఈరోజు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరిగింది. భోగాపురం, మడుతురు, పూడి ఆర్ అండ్ ఆర్ కాలనీ, పూడిమడక గ్రామాల్లో మంచినీరు సక్రమంగా రావడం లేదని సైడ్ కాలువలు నిర్మాణం చేపట్టాలని, హరిపాలెం గ్రామంలో చేతి బోరు బాగు చేయాలని పెదపాడు లో ఉన్న సీలింగ్ భూములు దళితులకు పంచాలని, పూడి, మార్టూరు గ్రామంలో భూములు, ఇల్లు కోల్పోయిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళిత గ్రామాల్లో మౌలిక సౌకర్యాలకు ఖర్చు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము ,రైతు సంగం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు, మత్స్య కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్యలు, గంట్యాడ చంటి ,మైలుపల్లి శ్రీను, నడుపూరు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్