బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తాగడానికి మంచినీరివ్వండి : ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

11 గంటల క్రితం

Provide drinking water: Women stage protest with empty pots.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 01:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వారం రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కరించకపోతే మండల కార్యాలయం వద్ద ఆందోళన


రోలుగుంట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట పంచాయతీ పరిధిలో దళిత కాలనీలో కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాలనీ మహిళలంతా ఖాళీ బిందెలు పట్టుకొని భిక్షాటన, ధర్నా నిర్వహించడం జరిగింది. బుచ్చింపేట గ్రామంలో 58 కుటుంబాల దళితులు జీవనం సాగిస్తూ ఉన్నారు. రెండు బోర్లు ఉన్నాయి. ఈ బోర్ లో వచ్చే నీరు కలుషితంగా రావడం వల్ల మంచినీరు తాగడానికి అనేక ఇబ్బందులు గురవడం జరుగుతుందని మహిళలు వాపోయారు. సొంతింటిలో బోర్లు వేసుకుని వాళ్ళ దగ్గర నీటిని అడుక్కొని రెండు రోజుల వరకు నీటిని దాచుకొని తాగవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. జల్జీవన్ మిషన్, అమృత ధార, వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా .... అవి దళిత కాలనీలో అమలు కాకపోవడం చాలా అన్యాయమన్నారు. నీటి కోసం వ్యవసాయ కూలి పనులు మానుకొని మంచినీళ్లు కోసం అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుందని, మరోవైపు ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి నేటికీ 78 సంవత్సరాల అవుతున్నా ... దళితులకు నేటికీ మంచినీళ్లు అందకపోవడం చాలా అన్యాయమన్నారు. అధికారులు స్పందించి తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కారం చేయకపోతే మండల కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ.చిరంజీవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే గోవిందరావు లు ప్రభుత్వాన్ని డిమాం డ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.అప్పల నరస దూడి, సత్యవతి, డోకల సత్యవతి, అనకాపల్లి రాజులమ్మ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్