శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రావాడ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తా!

6 రోజుల క్రితం

గొల్లగుంటలో వియ్యపు సరోజిని ఇంటింటి ప్రచారం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గొల్లగుంటలో వియ్యపు సరోజిని ఇంటింటి ప్రచారం

ప్రజాశక్తి-పరవాడ : రావాడ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి వియ్యపు సరోజిని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రావాడ పంచాయతీ పరిధిలోని గొల్లగుంట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే పంచాయతీ పరిధిలోని 12 వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వియ్యపు చిన్నా మాట్లాడుతూ రావాడ పంచాయతీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వియ్యపు సరోజినిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో స్థానికులు, మహిళలు, యువత పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్