సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాడుగుల పంచాయతీని ఏకగ్రీవం చేయండి

5 రోజుల క్రితం

మాడుగుల పంచాయతీని ఏకగ్రీవం చేయండి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​రానున్న మాడుగుల గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కోటి రూపాయలు వరకు పంచాయతీకి ఆదాయం లభిస్తుందని, తద్వారా అభివృద్ధి ముందుకు సాగుతుందని ప్రముఖ న్యాయవాది ఎస్ ప్రసాదరావు అన్నారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాడుగుల గ్రామ ప్రజలు, నాయకులు తనకు అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి నా స్వంత నిధుల నుండి రూ.50,00,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే ప్రభుత్వం కూడా మరో 50,00,000 రూపాయలు ఇస్తుందనీ మొత్తం కోటి రూపాయలు గ్రామ అభివృద్ధి కి ఉపయోగ పడుతాయన్నారు.

సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే మూడు సంవత్సరాలలో గ్రామంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తానని, లేకుంటే స్వచ్ఛదంగా రాజీనామా చేస్తానన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్