శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధారమఠం జలపాతంలో జారిపడి యువకుడు మృతి

26 జూన్, 2026

Youth dies after slipping and falling at Dharamatham waterfall.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గొలుగొండ (అనకాపల్లి) : గొలుగొండ మండలంలోని ధారమఠం జలపాతం వద్ద శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలానికి చెందిన చుక్కల వెంకట రమణ (22) తన ముగ్గురు స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్