గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా ‘చెకుముకి సైన్స్- 2026 సంబరాలు ప్రారంభం

2 గంటల క్రితం

‘Chekumuki Science-2026’ celebrations launched on a grand scale.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రావూస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా ‘చెకుముకి సైన్స్- 2026 సంబరాలు ప్రారంభం

శాస్త్రీయ ఆలోచనే ప్రగతికి మూలం

మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం. గేయానంద్


ప్రజాశక్తి -అనంతపురం : విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్నిపెంపొందించడమే సైన్స్ ముఖ్య ఉద్దేశమని మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం. గేయానంద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఓబుళదేవ నగర్ రావూస్ పాఠశాల ప్రాంగణంలో రావూస్ ఇంగ్లీస్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రధానోపాధ్యాయులు మాధవరావు అధ్యక్షతన అఖిల భారత ప్రజా సైన్స్ నెట్‌వర్క్ (ఏ ఐ పి ఎస్ ఎన్ ) అనుబంధ సంస్థ అయిన జనవిజ్ఞాన వేదిక (జె వి వి ) నగర కమిటీ ఆధ్వర్యంలో ‘చెకుముకి సైన్స్ సంబరాలు – 2026’ పాఠశాల స్థాయి ప్రతిభా పరీక్ష మరియు ప్రశ్నాపత్రాల అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం. గేయానంద్ హాజరై సర్ సి.వి. రామన్, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాంల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం సీల్ చేసిన చెకుముకి ప్రతిభా పరీక్ష ప్రశ్నాపత్రాలనుఅధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ ఎం. గేయానంద్ మాట్లాడుతూ సైన్స్ కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, నిత్యజీవితంలో మూఢనమ్మకాలను పారద్రోలి హేతుబద్ధంగా ఆలోచించడమే నిజమైన సైన్స్ అని స్పష్టం చేశారు. "నేర్చుకోవడం,పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగించడం, నిరూపించడం" అనే ఐదు సూత్రాల ద్వారా విద్యార్థులు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారనిఆకాంక్షించారు.చెకుముకి పరీక్ష లు షెడ్యూల్ ఇలా...

ఈ ప్రతిభా పరీక్షలో 8, 9, 10 తరగతుల విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థుల జట్టు తదుపరి స్థాయి పోటీలకు పాఠశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు.


మండల / పట్టణ స్థాయి పోటీలు : సెప్టెంబర్ 11

జిల్లా స్థాయి పోటీలు: సెప్టెంబర్ 27రాష్ట్ర స్థాయి పోటీలు: నవంబర్ 01, 02 మరియు 03 ఈ కార్యక్రమంలో జేవీవీ నగర అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, నగర కార్యదర్శి తిరుపాల్, చెకుముకి కన్వీనర్ రామకృష్ణ, విద్యాశాఖ అధికారులు, సైన్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్